బీఆర్‌ఎస్ నుండి అద్దంకి జగన్ సస్పెన్షన్

బీఆర్‌ఎస్ నుండి అద్దంకి జగన్ సస్పెన్షన్


మునుగోడు, ఆంధ్రప్రభ
: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు అద్దంకి జగన్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఐతగోని శేఖర్ ప్రకటించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

గ్రామ శాఖ అధ్యక్షుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అద్దంకి జగన్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. పార్టీ మద్దతు నిలిపిన అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తూ, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి విజయానికి సహకరించారని ఆరోపించారు. జగన్ వ్యవహరించిన తీరు వల్లనే పార్టీ అభ్యర్థి ఓటమి చెందారని, ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని పేర్కొన్నారు.

ఎన్నికల అనంతరం కూడా జగన్ తీరు మారలేదని, నిరంతరం పార్టీ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తూ కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఐతగోని శేఖర్ విమర్శించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన నేపథ్యంలో, అధిష్టానం ఆదేశాల మేరకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Leave a Reply