బీజీపీ వెలుగులోకి తీసుకొచ్చింది..

బీజీపీ వెలుగులోకి తీసుకొచ్చింది..

ఖమ్మం బ్యూరో, (ఆంధ్రప్రభ) : దేశాన్ని ఏకం చేసిన పటేల్‌ను కాంగ్రెస్ చరిత్రలో అణగదొక్కింది, స్వాతంత్ర్యానంతరం ఆయనకు తగిన గౌరవం ఇవ్వకుండా, కుటుంబపరమైన రాజకీయాల పట్లే కాంగ్రెస్ దృష్టి పెట్టిందనీ బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియం నుండి మినీ ట్యాంక్ బండ్ వరకు ఐక్యతా ర్యాలీని నిర్వహించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్‌ భారత్‌లో విలీనం కాలేదు కానీ కాంగ్రెస్‌ అతని పేరును కూడా చెప్పటానికి సంకోచించింది. బీజేపీ అధికారంలోకి రాకపోయి ఉంటే, పటేల్ విగ్రహం కూడా కట్టబడేది కాదు అని విమర్శించారు. పటేల్‌ చరిత్రను తిరిగి వెలుగులోకి తెచ్చిన బీజేపీ, ఆయన విలువలను కాపాడడమే తమ కర్తవ్యం అన్నారు. దేశాన్ని ఏకం చేసిన పటేల్‌ను చరిత్ర పుస్తకాల చివరి పేజీల్లో నెట్టేసింది కాంగ్రెస్‌. స్వాతంత్ర్యం తర్వాత ఆయనకు తగిన గౌరవం ఇవ్వకుండా, ఒక కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది. పటేల్‌ దృష్టి, దృఢసంకల్పం లేకపోయి ఉంటే ఈ దేశం నేడు ఒకే జెండా కింద నిలబడేది కాదు అని వ్యాఖ్యానించారు.

దేశం ఐక్యతకు ప్రతీక అయిన పటేల్‌ విగ్రహాన్ని కట్టింది బీజేపీ ప్రభుత్వం. కానీ.. కాంగ్రెస్‌ పాలనలో ఆయన పేరుతో ఒక్క స్మారక చిహ్నం కూడా కట్టలేదు. చరిత్రను వక్రీకరించే పార్టీగా కాంగ్రెస్‌ మిగిలిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ చరిత్రలో పటేల్‌ పాత్రను కావాలనే నీరుగార్చింది. కారణం, ఆయన నిర్ణయాత్మక ధోరణి, గాంధీ తర్వాత ఆయనకు ఉన్న ప్రజాదరణ, పార్టీ అంతర్గత రాజకీయాల్లో ఆయనకున్న స్థానం కాంగ్రెస్‌ కుటుంబానికి అసౌకర్యంగా మారిందని వారు ఆరోపిస్తున్నారు.


పటేల్ చూపిన ఐక్యత మార్గమే నేటి వికసిత భారత్‌కు మార్గదర్శనం చేస్తోందని కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఐక్యత అనేది కేవలం నినాదం కాదు.. అది త్యాగం, సంకల్పం, నిబద్ధత ఫలితం. నేటి ప్రభుత్వం అదే దారిలో నడుస్తూ, ప్రజల కలలను సాకారం చేసేందుకు మౌలిక వసతులు, సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలతో బలమైన ప్రజాస్వామ్యానికి పునాది వేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, వీరవెల్లి రాజేష్, రవి రాథోడ్, నకరికంటి వీరభద్రం, గంటేల విద్యాసాగర్, మందడపు సుబ్బారావు, దొడ్డా అరుణ, దుద్దుకూరు వెంకటేశ్వరరావు, మందార ప్రభాకర్ రెడ్డి, జ్వాలా నరసింహారావు గౌడ్, ఆర్విఎస్ యాదవ్, రజినీ రెడ్డి, నెల్లూరు బెనర్జీ, మంద సరస్వతి, బోయినపల్లి చంద్రశేఖర్, సురేందర్ రెడ్డి, రామ్ శెట్టి నాగేశ్వరావు, కొంచెం కృష్ణారావు, రవి గౌడ్, సైదేశ్వరరావు, బోయినపల్లి సురేష్, జిల్లా అధికారులు మండల అధ్యక్షులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply