స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే

స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే

  • జైనూర్ నాయకులు

జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో సోమవారం భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ 26వ ఆవిర్భావ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మండల పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్ లాల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో గులాబీ జెండాను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్ లాల, మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావు, సర్పంచ్ కొడప ప్రకాష్ మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని కొనియాడారు. అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాడే ఏకైక శక్తి బీఆర్ఎస్ అని వారు స్పష్టం చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం “జై తెలంగాణ.. జై కేసీఆర్” నినాదాలతో జైనూర్ మార్కెట్ వీధులు హోరెత్తాయి.

ఈ వేడుకల్లో మాడవి భీమ్ రావ్, జామ్ని సర్పంచ్ మడవి సోంబాయి నాగోరావ్, పొలాస సర్పంచ్ భావురావ్, శివనూర్ సర్పంచ్ శ్రావణ్, మాజీ సర్పంచ్ కుమ్ర శ్యామ్ రావు పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ నాయకులు పెందూర్ మోహన్, ఆత్రం సుదర్శన్, జాదవ్ ఉత్తమ్, కుమ్రా దేవు, షాకీల్, ఖలీం, సమ్మక్వర్ నర్సింగ్, తొడసం బీరశవ్, రాపెన్ రమేష్, గరుడ్కార్ కేశవ్, దావుజీ, హైమద్, జాదవ్ రవి తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply