వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల విస్తృత ప్రచారం
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి,బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నెవూరి ధర్మేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 2,3,4,7,9,10, 11 ,12 వార్డులలో అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని… బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేసి బి ఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు.
మోత్కూరు మున్సిపాలిటీ కేవలం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ..గత ఐదేళ్లలో మోత్కూర్ మున్సిపాలిటీకి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సహకారంతో కోట్లాది రూపాయలు మంజూరయ్యాయన్నారు. అప్పుడు మంజూరైన పనులకు కొబ్బరికాయలు కొట్టి… ప్రస్తుత ఎమ్మెల్యే సామెల్ ప్రారంభోత్సవాలు చేశారన్నారు .మున్సిపల్ ప్రజలు గమనించి ఈనెల 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు మర్రి మరియమ్మ ,సుల్తాన్ స్వామి, కొండ శోభ సోoమల్లు, దొంతోజు శ్రీలత శ్రీనివాస్,మన్నె భీమయ్య, నల్ల మధు, పసల మరియన్నవిజయ,కూరేళ్ల పద్మ పరమేష్ తో పాటు బిఆర్ఎస్ మండల పార్టీ ల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్,కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి , అయితగోని వెంకన్న గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ లు మహేంద్ర నాథ్ , యాకుబ్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి, మామిడి సర్వయ్య, నాయకుడు గజ్జి మల్లేష్, మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, బోడ శీను, దేవా ,ఇంద్రజ్యోతి, మొరిగాల శీను, వెంకన్న ,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
