29thaprilmarriage |యువతి హత్య కేసులో నిందితుడి అరెస్టు…

29thaprilmarriage |యువతి హత్య కేసులో నిందితుడి అరెస్టు…
29thaprilmarriage | అనుమానం పెంచుకుని పథకం ప్రకారమే హత్య
బావిలోకి తొంగి చూడమని చెప్పి తోసేశాడు
సాక్షులు, సాంకేతిక ఆధారాలతో నిందితుడు అరెస్ట్
29thaprilmarriage | మరిపెడ, ఆంధ్రప్రభ : కట్టుకోబోయే వాడే కాల యముడై యువతిని నమ్మించి తీసుకెళ్లి హత్య చేసినట్లు మహబూబాబాద్ జిల్లా మరిపెడ సీఐ ఎల్ పవన్ కుమార్ వెల్లడించారు. తనకు కాబోయే భార్య వేరే వారితో చనువుగా మాట్లాడిందని.. ఆమె పై అనుమానం పెంచుకుని పథకం ప్రకారమే కట్టుకోబోయే వాడే యువతిని నమ్మించి తీసుకెళ్లి హత్య చేసినట్లు మహబూబాబాద్ జిల్లా మరిపెడ సీఐ ఎల్ పవన్ కుమార్ వెల్లడించారు.
ఈ నెల 22వ తేదీన ఇటుకల గడ్డ తండా సమీపంలోని ఓ బావిలో యువతి అనుమానస్పదంగా మృతి చెందిన కేసును మరిపెడ పోలీసులు ఛేదించారు. సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం ఇటుకలగడ్డ తండాకు చెందిన భూక్య సంగీత(20)కు మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త తండాకు చెందిన అజ్మీర అరవింద్ కు ఈ నెల 29వ తేదీన పెళ్లి జరగాల్సి ఉండగా ఇటీవల యువతి ఇంట్లో జరిగిన ఓ శుభకార్యంలో వేరే వారితో చనువుగా మాట్లాడటం చూసిన అరవింద్ అప్పటి నుంచి కాబోయే భార్య పై అనుమానం పెంచుకున్నాడు.

ఈ క్రమంలోనే ఎలాగైనా సంగీతను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుని చంపేయాలని పథకం పన్నాడు. అందులో భాగంగానే తన ఇంట్లో శుభకార్యానికి అత్తమామను పిలిపించుకున్నాడు. ఇంట్లో సంగీత ఒంటరిగా ఉన్న సమయంలో తండా బయటకు రమ్మని పిలిచాడు. అనంతరం యువతిని బైకుపై ఎక్కించుకుని తండా సమీపంలోని ఓ బావి వద్దకు వెళ్లారు. బావిలో నీళ్లు బాగున్నాయి చూడు అని చెప్పాడు.
ఆమె బావిలోకి తొంగి చూడటంతో అందులోకి తోసేశాడు. అనంతరం ఆమె చనిపోయే వరకు అక్కడే ఉండి చనిపోయిందని నిర్దారించుకుని వెళ్లిపోయాడు. కానీ యువతిని బైకుపై ఎక్కించుకుని వెళ్లడం చూసిన పలువురు సాక్షులు, సాంకేతికత ఆధారంగా అరవిందే నిందితుడిగా నిర్దారించి ముద్దాయిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పవన్ కుమార్ వెల్లడించారు.
