మిన్నంటిన బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు

మిన్నంటిన బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) పార్టీ 26వ ఆవిర్భావ వేడుకలను సోమవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మండలంలోని పలు గ్రామాల్లో గులాబీ జెండాలు ఆవిష్కరించి పార్టీ పట్ల తమకున్న విధేయతను చాటుకున్నారు.

పొట్టపెల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఉల్వజీ నరేందర్ ఆధ్వర్యంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, కేసీఆర్ గారి నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోతుగంటి ప్రశాంత్, చిన్నారెడ్డి, సాయన్న, రాకేష్, బొడ్డు భోజన్న మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply