మార్కెట్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం

మార్కెట్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం
మున్సిపల్ చైర్మన్ స్వప్న ని సన్మానించిన మార్కెట్ చైర్మన్ విమల
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గడ్డం స్వప్న సోమనర్సయ్య లను శుక్రవారం స్థానిక మార్కెట్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశం అనంతరం మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు గౌడ్ ,పాలకవర్గం ఆధ్వర్యంలో శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, మార్కెట్ కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి,మార్కెట్ డైరెక్టర్లు ఏం డి సమీర్,పన్నాల శ్రీనివాస్ రెడ్డి, పోచం జగన్, సోమ వెంకన్న, బుస్స రవి,బాలెంల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
