పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం

పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం

  • మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల, ఆంధ్రప్రభ: పరకాల పట్టణంలోని లలిత మినీ కన్వెన్షన్ హాల్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా పార్టీ పరిస్థితులు, కార్యకలాపాలపై విస్తృతంగా చర్చించారు.

రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే వార్డుల వారీగా నూతన కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు పరకాల పట్టణ కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని వెల్లడించారు.

ఈ సమావేశంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. “పార్టీ బలం కార్యకర్తలే, మీరు ప్రతి ఒక్కరూ ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలి. మన పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, దాన్ని మరింత పెంచే బాధ్యత మన అందరిదీ. వార్డుల స్థాయిలో బలమైన నిర్మాణం ఉంటేనే పట్టణ స్థాయిలో విజయం సాధించగలం. అందుకే త్వరలోనే వార్డుల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి కార్యకర్తకు బాధ్యతలు అప్పగిస్తాం. జగిత్యాలలో నిర్వహించిన కేసీఆర్ సభతో పార్టీకి మరింత బలంచేకూరింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాానికి బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయారని తెలుసుకున్నారని మళ్ళీ కేసీఆర్ ను సీఎం గా చూడాలని నిర్ణయించుకొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుదాం“ అని పిలుపునిచ్చారు.

Leave a Reply