విద్యార్థులతో తల్లిదండ్రులకు లేఖలు రాయించిన సీఐ

విద్యార్థులతో తల్లిదండ్రులకు లేఖలు రాయించిన సీఐ

కరీమాబాద్, ఆంధ్రప్రభ: ప్లీజ్ డాడీ హెల్మెట్ ధరించండి కుటుంబానికి రక్షణగా నిలవండి అని విద్యార్థులు పేరెంట్స్ కు లేఖలు రాశారు. అలైవ్ అర్రైవ్ రోడ్డు భద్రత అవగాహన సదస్సు లో భాగంగా బుధవారం మిల్స్ కాలనీ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ 34వ డివిజన్ శివనగర్ వందన హైస్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. డాడీ, సోదరులు హెల్మెట్ ధరించే విధంగా విద్యార్థులు చొరవ చూపాలని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడప రాదని మీరు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

హెల్మెట్ ధరించకపోవడం వల్ల, మద్యం సేవించడం వల్ల ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని, ఆయన అన్నారు. చదువుకున్న విద్యార్థిగా బాధ్యతలు గుర్తించి కుటుంబ సభ్యులు అలైవ్ అర్రైవ్ సూత్రం పాటించే విధంగా విద్యార్థులు నడుం బిగించాలని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు సీఐ విద్యార్థులచే లేఖలు రాయించారు. కార్యక్రమంలో వందన హై స్కూల్ ప్రిన్సిపాల్ ఆడెపు శ్యామ్, మిల్స్ కాలనీ ఎస్సై రమేష్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply