అన్నప్రసాదానికి లక్ష రూపాయల విరాళం..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి రూ.1,00,000/- ను దాత పిద్దినేని మధుబాబు భార్య కుసుమ కుమారి లు ఆలయంలోని అధికారుల్ని అర్చక స్వాములను కలిసి భక్తిశ్రద్ధలతో విరాళము సమర్పించి ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ప్రధానాలయ సూపర్డెంట్ డివివి సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు రసీదును అందజేశారు.