15వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ..

15వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ..

ప్రారంభించిన కౌన్సిలర్ చింతల వసంత

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని 15వ వార్డులో మూడు నెలల కోటా రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం కౌన్సిలర్ చింతల వసంత ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు బియ్యాన్ని అందజేస్తూ పంపిణీ ప్రక్రియను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీగా లబ్ధిదారులకు అందజేయాలని డీలర్‌ను ఆదేశించారు. మూడు నెలల రేషన్ ఒకేసారి అందడం పట్ల వార్డు ప్రజలు, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ మంతెన రమేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.