భూతగాదా లో అన్నపై గొడ్డలితో తమ్ముని దాడి

భూతగాదా లో అన్నపై గొడ్డలితో తమ్ముని దాడి

చెన్నూర్ ఆంధ్రప్రభ :మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మేర గ్రామములో భూ తగాదాల నేపథ్యంలో అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది.ఇవ్వాళ కొమ్మెర గ్రామంలో ఆస్తి వివాదం కారణంగా జోగురు రాజయ్య (48)పై అతడి తమ్ముడు, కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాజయ్య తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ఘటనపై సమాచారం అందుకున్న తహశీల్దార్ మల్లికార్జున్ ఆసుపత్రికి చేరుకుని రాజయ్య వాంగ్మూలం నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply