బెల్లంపల్లిలో స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
బెల్లంపల్లిలో స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి పట్టణంలోని పలు స్క్రాప్ దుకాణాలను మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి–రమేష్, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, నిబంధనలను పాటించకుండా, కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా జనావాసాల మధ్య స్క్రాప్ దుకాణాలు నిర్వహిస్తున్నారని స్థానికుల ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
ఇలాంటి దుకాణాల వల్ల అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య ఉన్న స్క్రాప్ దుకాణాలను వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
లేనిపక్షంలో యజమానులపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
