విప్లవ వీర కిశోరం సర్దార్ భగత్ సింగ్ చిరస్మరణీయుడు..

విప్లవ వీర కిశోరం సర్దార్ భగత్ సింగ్ చిరస్మరణీయుడు..

సమ సమాజ నిర్మాణానికి పోరాడటమే నిజమైన నివాళులు.

కరిమాబాద్, ఆంధ్రప్రభ : దేశ స్వాతంత్ర్యం కోసం చిరునవ్వుతో ఉరికంబ మెక్కిన విప్లవ వీర కిశోరం సర్దార్ భగత్ సింగ్ చిరస్మరణీయుడని వారి ఆశయమైన సమ సమాజ నిర్మాణానికి పోరాడటమే నిజమైన నివాళులు అర్పించినట్లు కాగలదని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు అన్నారు. సోమవారం 95 వర్ధంతి సందర్భంగా కొత్తవాడలో భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రాములు ప్రసంగిస్తూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటాలు , త్యాగాలు చేసిన మహనీయులను జాతి ఏనాటికి మరవదన్నారు. కార్యక్రమంలో బొద్దుల ప్రశాంత్ ,సుమన్, సానాది ప్రశాంత్, సామేల్ ,అభి, రమాదేవి, ప్రియాంక, అనూష, మధుమిత ,అలేఖ్య,
నిక్షిత్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply