ప్రతి ఫిర్యాదుకు శాశ్వత పరిష్కారం అందించాలి…

ప్రతి ఫిర్యాదుకు శాశ్వత పరిష్కారం అందించాలి…

ఇంచార్జీ కమిషనర్ డాక్టర్ చంద్ర శేఖర్…

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి.చంద్ర శేఖర్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంచార్జీ కమిషనర్ డాక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ ప్రతి సమస్యకు క్షేత్ర స్థాయి లో అధికారులందరూ పరిశీలించాలని, అర్జీదారులకు వారి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందిస్తామన్న భరోసాని ఇవ్వడమే కాకుండా సత్వరమే అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 20 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 9, ఇంజనీరింగ్ 6, పబ్లిక్ హెల్త్ 2, రెవెన్యూ 3, మొత్తం కలిపి 20 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.

ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె.సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి.సృజన, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, బయాలజిస్ట్ వి.కామేశ్వరరావు, ఆర్ఎఫ్ఓ మాల్యాద్రి పాల్గొన్నారు.

Leave a Reply