2-children-murder : ఇద్దరు బిడ్డల్ని చంపి.. Andhra Prabha Crime News
2-children-murder : ఇద్దరు బిడ్డల్ని చంపి.. Andhra Prabha Crime News
- ఓ తల్లి ఆత్మహత్యాయత్నం
- ఓ పాపకు మూడేళ్లు
- మరో చిట్టితల్లికి నాలుగు నెలల ప్రాయం
- ప్రస్తుతం కొన ఊపిరిలో తల్లి
- ఆముదాలవలసలో.. దారుణం
(ఆమదాలవలస (శ్రీకాకుళం) , ఆంధ్రప్రభ బ్యూరో):
2-children-murder : భర్త కుటుంబ పోషణ కోసం వలస వెళ్లాడు. ఇంట దగ్గర ఇద్దరు పిల్లలు, అత్తతో కలసి జీవిస్తున్న ఓ ఇల్లాలు క్షణికావేశంతో… తన ఇద్దరు బిడ్డల పీక కోసి.. తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కొన ఊపిరితో తల్లడిల్లుతోంది. ఈ విషాద ఘటన సభ్య సమాజాన్ని కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం, వెదుళ్లవలస గ్రామానికి చెందిన కూర్మాపు రమణ నిరుపేద. కుటుంబ పోషణ నిమ్మిత్తం తెలంగాణలోని నల్డొండకు వలస వెళ్లాడు. అతడికి భార్య వరలక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు భవానీ (3). చాందినీ (4 నెలలు) ఉన్నారు. తల్తి లక్ష్మీ కూడా వీరితోనే ఉంటుంది. సోమవారం రాత్రి వరలక్ష్మీ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటిలో పడుకోగా, ఆమె అత్త లక్ష్మి ఇంటి బయట పడుకున్నారు. మంగళవారం ఉదయం లక్ష్మి లేచి ఇంటి తలుపులు తీసేసరికి వరలక్ష్మీ తన ఇద్దరు పిల్లలకు పీక కోసి తాను పీకకోసుకొనికున్నట్లు గా కనిపించారు . ఇద్దరు పిల్లలు అప్పటికే మృతి చెందారు. కోడలు వరలక్ష్మి కొన ఊపిరితో ఉండగా గ్రామస్తులు 108 అంబులెన్స్ లో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అత్త వేధింపులు కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై బాలరాజు ఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలిస్తున్నారు.



