మేలైన విత్తనాలు రైతాంగానికి అందించాలి..
- మున్సిపాలిటీ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
మరిపెడ, ఆంధ్రప్రభ : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మరిపెడ మండలంలోని గిరిపురం గ్రామ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళా విక్రయ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ధృవీకరించిన, నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేసి సాగు చేయాలని సూచించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ అధికారులు, విత్తనాల డీలర్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ఏడీఏ శ్రీదేవి, ఏఓ వీరాసింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, గిరిపురం సర్పంచ్ నీలా సైదులు, ఫర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాలం శ్రీనివాస్ రెడ్డి, జడల సురేందర్, ఉప్పల కృష్ణమూర్తి, హరీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
