గ్రామాల అభివృద్ధికే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక..

గ్రామాల అభివృద్ధికే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక..

మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమం అమలు చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మేజర్ గ్రామపంచాయతీలో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక (99రోజుల)కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయములో ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ తో కలిసి కార్మికులకు శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంతగా దాదాపు40 మంది కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వం 99 రోజులు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ఆయన అన్నారు. అనంతరం పాత బస్టాండ్ లోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం సమీపంలోని రోడ్డు పక్కన ప్రజల సౌకర్యార్థం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే సర్పంచ్ భూమి పూజ చేశారు. మరుగుదొడ్ల నిర్మాణ పనులు నాణ్యత లోపించకుండా చూడాలని త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు సర్పంచ్ అనిత శ్రీనివాస్ యాదవ్ ఉపసర్పంచ్ అశ్రద్ బేగం అన్సారి అలీ, డిఎల్పిఓ ఎంపీడీవో,ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీఈ ఓ శంకర్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply