జన్నారం టీచర్ల ‘ఫిన్లాండ్‌’ విద్యా యాత్ర సక్సెస్!

జన్నారం టీచర్ల ‘ఫిన్లాండ్‌’ విద్యా యాత్ర సక్సెస్!

జన్నారం, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం తరఫున విదేశీ విద్యా విధానంపై అధ్యయనం చేయడానికి ఫిన్లాండ్ వెళ్లిన ఉపాధ్యాయులు శుక్రవారం స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఈ పర్యటనను విజయవంతంగా ముగించుకుని వస్తున్న ఉపాధ్యాయులకు జన్నారం మండల కేంద్రంలో పలువురు ప్రముఖులు స్వాగతం పలుకుతున్నారు.

విదేశీ విద్యా విధానంపై అధ్యయనం..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో, విదేశీ విద్యా విధానాలను పరిశీలించడానికి ఈనెల 20 నుంచి 24 వరకు రాష్ట్ర ప్రభుత్వం 28 మంది ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపించింది. ఇందులో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వారిలో దాముక కమలాకర్, కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్), జాజాల శ్రీనివాస్, అక్కపల్లిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరు ఫిన్లాండ్‌లోని వివిధ యూనివర్సిటీలను సందర్శించి, అక్కడి విద్యావేత్తలతో చర్చించి, అక్కడి బోధనా పద్ధతులపై లోతైన వివరాలను సేకరించారు.

హర్షం వ్యక్తం చేస్తున్న సంఘాలు
విదేశీ పర్యటన ముగించుకుని వస్తున్న ఉపాధ్యాయులకు విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్, సామాజికవేత్తలు భూమాచారి, మామిడిపల్లి హరికృష్ణ, రేండ్లగూడ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వి.రవి చారి, ప్రధాన కార్యదర్శి బండోజు లక్ష్మీనర్సయ్య తదితరులు శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు. మన ప్రాంత ఉపాధ్యాయులు విదేశీ విద్యపై అధ్యయనం చేసి రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply