మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామాభివృద్ధి..

మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామాభివృద్ధి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లోఅభివృద్ధిచేస్తానని ఓబులాపూర్ సర్పంచ్ సత్యనారాయణరెడ్డిఅన్నారు. మంగళవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఓబులాపూర్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మొరం రోడ్డు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సమస్యలు గుర్తించి పరిష్కార మార్గానికి నాంది పలుకుతుందనిఅన్నారు. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు గుర్తించి మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తారనిఅన్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు దశలవారీగా పరిష్కరించి ప్రణాళికబద్ధంగా అభివృద్ధికి ముందుకు సాగుతుందని నిరంతరం ప్రజలకు అందుబాటులోఉంటానని అన్నారు. 2వ వార్డులో వర్షాకాలం బురదమయంగా మారడంతో మొరం మట్టి వేయడంతో గత కొన్నేళ్లుగా నెలకొన్న సమస్యకు పరిష్కార మార్గం లభించడంతో ఆయా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేసి సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హన్మంతు, వార్డుసభ్యులు నర్సప్ప, కిష్టమ్మ , నాయకులు భీమకవిరెడ్డి, బీరప్ప,హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply