కేంద్ర ప్రభుత్వ నిధులతో పల్లె సీమలు అభివృద్ధిచేస్తాం..

కేంద్ర ప్రభుత్వ నిధులతో పల్లె సీమలు అభివృద్ధిచేస్తాం..

బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శిఎం. భాస్కర్.

ఊట్కూర్, ఆంధ్రప్రభ: కేంద్రప్రభుత్వం నిధులు తీసుకొచ్చి పల్లె సీమల అభివృద్ధికి కృషి చేస్తామని బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్, బిజెపి మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, పెద్దజట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిపెద్దజట్రంలో ఎంపీనిధులు రూ. 5 లక్షలతోసిసిరోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విరివిగా మంజూరు చేస్తుందనిఅన్నారు. ఎంపీ నిధులతో హైమాక్స్ లైట్లు సిసి రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేస్తున్నామనిఅన్నారు.

గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడంతో పాటు ఎంపీడీకే అరుణ ఊట్కూర్ మండలంలో గత ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో మండలం పై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులుమంజూరుచేస్తున్నారని అన్నారు. పెద్దజట్రం గ్రామంలో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని ఐదేళ్లలో గ్రామ రూపురేఖలు మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దజట్రం ఉప సర్పంచ్ స్వాతి పవన్ కుమార్, ఊట్కూర్ మాజీ ఉపసర్పంచ్ గోపాల్, పెద్దజట్రం గ్రామ అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీఎంపిటిసి కిరణ్ కుమార్,వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply