గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రకీలకం..

గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రకీలకం..

జుక్కల్ కామారెడ్డి, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమని జుక్కల్ ఎంపిఓ రాము తెలిపారు. మండలంలోని 11 గ్రామపంచాయతీలోని 96 వార్డు సభ్యులకు మండల కేంద్రంలోని రైతు వేదికలో మొదటిరోజు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీఓ రాము ప్రారంభించారు. మొదటి విడత శిక్షణ కార్యక్రమం ఈనెల 13 వరకు కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలాన్ని అర్హులైన ప్రజలకు అందే విధంగా,గ్రామపంచాయతీలో జరిగే గ్రామసభలు విజయవంతం కావటానికి, గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి గ్రామ వార్డు సభ్యులు చురుకుగా ఉంటూ తమ వంతుసహకారం అందించాలన్నారు.ఈ సందర్భంగా శిక్షకులు అశోక్, నాగయ్య,నవీన్,దయాకర్ శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వార్డు సభ్యులందరికీ భోజన వసతి కల్పించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సైతం పాల్గొన్నారు.

Leave a Reply