ఉత్తమ ప్రధానాచార్యగా గుండేటి కోటేశ్వరరావు

ఉత్తమ ప్రధానాచార్యగా గుండేటి కోటేశ్వరరావు

ఆసిఫాబాద్ రూరల్ , (ఆంధ్రప్రభ) ఆసిఫాబాద్ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు ఉత్తమ ప్రధానాచార్యులుగా బుధవారం శ్రీ సరస్వతి విద్యాపీఠం హైదరాబాద్ లో ఉత్తమ ప్రధానాచార్యులుగా ఘనంగా సత్కరించారు.
శ్రీ సరస్వతీ విద్యా పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మే 27 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు జరుగుతున్న వర్షారంభ సమావేశాల సందర్భంగా సరస్వతీ విద్యాపీఠం లోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానాచార్యులకు విశిష్ట సేవలు అందించిన ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీ పతకమూరి శ్రీనివాస్ శాలువ ప్రశంస పత్రంతో ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తక్కళ్ళపల్లి తిరుపతి రావు గారు ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీ పతకమూరి శ్రీనివాస్ గారు, ప్రాంత కార్యదర్శి శ్రీమతి అనఘా వెంకటలక్ష్మి గారు, దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు శ్రీ చామర్తి ఉమా మహేశ్వర రావు గారు, శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Leave a Reply