ఏజెన్సీలో నూతన ఓరవడికి శ్రీకారం..
ఏజెన్సీలో నూతన ఓరవడికి శ్రీకారం..
ఉట్నూర్, జైనూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ ఏజెన్సీ మండలాల్లోని ఆదివాసి గ్రామాల్లో సర్పంచులు ఆదివాసి గ్రామ పటేళ్లు గ్రామ పెద్దలు నూతన ఓరవడికి శ్రీకారం చుట్టారు. ఆదివాసి గ్రామాల్లో జరిగే వివాహ వేడుకల్లో కట్న కానుకలు ఇవ్వకుండా నిరుపేద వధూవరులకు ఆదివాసి గ్రామాల లో ఇంటింటికి అంతోకొంతో డబ్బులు వసూలు చేసి నిరుపేద వధూవరులకు సహాయాలు అందిస్తున్నారు. వివాహాలు చేయడం ఖర్చులతో కూడిన పని కావడంతో నిత్యవసర సరుకుల కోసం ఒక మంచి ఆలోచనతో ఈ ఏడాది నుండి ఏజెన్సీ గ్రామాల్లోని ఆదివాసి గూడలలో ఎవరైనా నిరుపేదలు వివాహం చేసుకుంటే ఇంటింటికి కట్నం రూపంలో డబ్బులు వసూలు చేసి వధూవరులకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
నూతన ఓరవడికి శ్రీకారం చుట్టిన ఆదివాసీలు ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వివా వేడుకల్లో మెమొంటోళ్లు ఇతర కట్నాలు ఇవ్వకుండా ఇంటింటికి డబ్బులు వసూలు చేసి నగదు రూపంలో సహాయం అందిస్తున్నారు. బుధవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దుబ్బగూడ, పంచాయితీ దుబ్బగూడలో నిరుపేద వధువు వివాహానికి 13,100 వధువుకు నగదు సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దుబ్బగూడ సర్పంచ్ మడావి కౌసల్య భీమ్రావు, గ్రామ పటేళ్లు దేవారిలు, గ్రామ పెద్దలు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
