ఉట్నూర్ ఏజెన్సీలో సబ్ కలెక్టర్ల క్షేత్ర పర్యటన

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలో రెండు రోజుల క్షేత్ర పర్యటన కోసం శుక్రవారం 20 మంది సబ్ కలెక్టర్ల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఐటిడిఏ కార్యాలయంలో ఐటిడిఏ పి.ఓ యువరాజ్ మర్మాట్‌తో ముఖాముఖి సమావేశమై గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవల వివరాలను తెలుసుకున్నారు.

అనంతరం బృందం ఉద్యానవన శాఖ నర్సరీ, ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి, గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించింది. అక్కడ విద్య, భోజన వసతి, వైద్య సేవలు తదితర అంశాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకుంది. ఏజెన్సీలో గిరిజనులకు అందుతున్న సంక్షేమ పథకాలు, సేవలపై సమగ్రంగా అవగాహన పొందింది.

ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పి.ఓ యువరాజ్ మర్మాట్, ఉద్యానవన శాఖ అధికారి, జిసిసి డీఎం గుడిమల్ల సందీప్ కుమార్, ఐటిడిఏ పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ ఉపేందర్ జాదవ్, అధికారులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply