జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు..

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు..

వాంకిడి ,(ఆంధ్ర ప్రభ) కొమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని
బంబార గ్రామ పంచాయతీ రైతు వేదికలో, ఆసిఫాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు. శనివారం అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంకేత్ మిత్ర , సీనియర్ సివిల్ జడ్జ్ మాట్లాడుతూ మహిళల హక్కులు, బాల్య వివాహాల నివారణ, వ్యభిచారం వల్ల కలిగే నష్టాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై మహిళలకు విస్తృత అవగాహన కల్పించారు. సమాజంలో మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, చట్టపరమైన రక్షణలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జక్కుల అనంతలక్ష్మి జూనియర్ సివిల్ జడ్జ్, అంజనాదేవి పాల్గొని మహిళలకు చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.
అలాగే ఈ కార్యక్రమంలో బంబార గ్రామ సర్పంచ్ బెండరే కృష్ణాజీ , ఉపసర్పంచ్ సంతోష్ , వార్డు సభ్యులు లోహబడే ఉమేష్ , కోట్నాక రాంశవ్, డోకె బండు, ఆకారపు శైలేష్ , డి హెచ్ ఈ డబ్ల్యు (జీఏస్) శారద , జెండర్ స్పెషలిస్ట్ బైరాగి రాణి , నిర్మల , సలక్క గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ అవగాహన సదస్సు మహిళల్లో చైతన్యం పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగాఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply