ఎండ తీవ్రతతో ఉపాధి కూలీలు జాగ్రత్త పాటించాలి
ఎండ తీవ్రతతో ఉపాధి కూలీలు జాగ్రత్త పాటించాలి
-సర్పంచ్ శ్రీరామ్ సుమలత అరవింద్
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: ఉపాధి హామీ కూలీలు ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలని బాబానగర్ గ్రామ సర్పంచ్ శ్రీరామ్ సుమలత అన్నారు. బుధవారం భీమ్‌గల్ మండలంలోని బాబానగర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు పరిశీలించి ఎండ తీవ్రతతో జాగ్రత్త పాటించాలంటూ ఉపాధి హామీ కూలీలకు కూలింగ్ వాటర్, మజ్జిగ, ఓఆర్ఎస్, పాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం ఉపాధి హామీ కార్మికులు చేస్తున్న సేవ ఎంతో గొప్పది. మండుటెండల్లో సైతం గ్రామం కోసం కష్టపడుతున్న ప్రతి కార్మికుడి ఆరోగ్యం మా బాధ్యత. వారి శ్రమతోనే గ్రామల చెరువులు పునరుద్ధరించబడుతూ, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఉదయం వేళ పనులు చేయాలన్నారు. రైతులు వ్యవసాయ పొలాల్లో చేపట్టే వివిధ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలని అన్నారు.
ప్రభుత్వం కొలతల ప్రకారం కూలీలకు డబ్బులు చెల్లిస్తుందని కూలీలు కలసికట్టుగా పనులు చేసుకుంటే గిట్టుబాటు కూలివస్తుందన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశంలో కూలీలకు వసతులు కల్పించాలని అన్నారు.కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంద ఇమ్మాన్యుల్, వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శ రమ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మంద వినోద్, కారోబార్ గంగ నర్సయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
