Hospital | బీఎప్‌పీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Hospital | బీఎప్‌పీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
Hospital | బోధన్, ఆంధ్ర ప్రభ : బహుజన సమాజ్ ఆధ్వర్యంలో బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సన్ రైజ్ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి వైద్యులు ఈ ఆరోగ్య శిబిరo వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సిరివెసు సంతోష్ మాట్లాడుతూ… దళిత, బహుజనుల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహించామన్నారు.
వీరికి ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ టెస్ట్ లను చేయడంతో పాటు జ్వరం, దగ్గు, బలహీనత, గ్యాస్ట్రిక్ సమస్యలు తదితర జబ్బులకు మందులను ఉచితంగా ఇవ్వడం అందజేశారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో 220 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ పీ బోధన్ అసెంబ్లీ ఇంచార్జి నీరడి రవి, నాయకులు ఎన్నోళ్ల శ్యామ్, లంకేశ్, హాస్పిటల్ ఇంచార్జ్ శ్రీనివాస్, జతిన్ బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
