దళారుల వద్దకు వెళ్లి మోసపోవద్దు
దళారుల వద్దకు వెళ్లి మోసపోవద్దు
- జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో మల్కాపురం శివకుమార్
సంగారెడ్డి, ఆంధ్రప్రభ: మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) ఏడాకులపల్లిలో బుధవారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మల్కాపురం శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన జొన్నలను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.3,699 పొందాలని సూచించారు. దళారుల వద్దకు వెళ్లి మోసపోవద్దని రైతులకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంతమ్మ, డైరెక్టర్లు శ్రీనివాస్, రాజు, శ్రీశైలము, భాస్కర్, బసవరాజు, ఏడాకులపల్లి సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఉపసర్పంచ్ వెంకటేష్, చిలేమామిడి ఉపసర్పంచ్ రాచన్న, ప్రభు పటేల్, మాజీ సర్పంచ్‌లు గోపాల కృష్ణ, శ్రీనివాస్, వీరన్న పాటిల్, అమృతం పాటిల్, వివిధ గ్రామాల ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
