పోలీసు సిబ్బంది సేవలు మరువలేనివి

పోలీసు సిబ్బంది సేవలు మరువలేనివి

కమ్మర్‌ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించి, బదిలీపై వెళ్తున్న పలువురు పోలీసు అధికారులకు, సిబ్బందికి బుధవారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ నరేందర్, హెడ్ కానిస్టేబుల్ ఇ. వెంకటేశ్వర్లు , ఎండి.అఫ్సర్, కానిస్టేబుల్స్ వసుధ,చైతన్య,సర్జన్ కుమార్,నవీన్ చంద్ర,నందకిశోర్ లను కమ్మర్‌పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి మరియు సిబ్బంది పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జి.అనిల్ రెడ్డి మాట్లాడుతూ… కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో బదిలీపై వెళ్తున్న సిబ్బంది అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.

విధి నిర్వహణలో వారు చూపిన అంకితభావం, క్రమశిక్షణ తోటి సిబ్బందికి స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. కొత్త ప్రాంతాల్లో కూడా వారు ఇలాగే ప్రజలకు సేవలందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. సన్మానం పొందిన సిబ్బంది మాట్లాడుతూ.. కమ్మర్ పల్లి పోలీసు స్టేషన్ లో పని చేయడం తమకు మంచి అనుభూతిని ఇచ్చిందని, తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply