యువతి ఫోటోలతో నీచానికి తెగబడ్డాడు.. చివరికి..
మరిపెడ, ఆంధ్రప్రభ: మరిపెడ గ్రామానికి చెందిన ఓ యువతిని సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురిచేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్దిరోజులుగా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన కాంచనపల్లి జోసెఫ్ మరిపెడకు చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకొని, ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ (మారు) ఖాతాలు సృష్టించి ఆమె ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. దీంతో బాధిత యువతి తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మహిళలను ప్రేమ పేరుతో వేధించడం, వారి ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో దుర్వినియోగం చేయడం, మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం వంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి వేధింపులకు గురైన మహిళలు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

