కూలీల సంఖ్య పెంచి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి

కూలీల సంఖ్య పెంచి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి

-ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్

ఊట్కూర్, ఆంధ్రప్రభ: గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచుతూ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాల్లోని చెరువుల్లో కూడికతీత పనులు చేపట్టి మండలంలో 3450 మంది కూలీలు పనులకు వచ్చే విధంగా చూడాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశంలో కూలీలకు చలువపందిర్లు తాగునీరు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.

ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీలో 3000 మొక్కలు చొప్పున సిద్ధం చేయాలన్నారు. రైతుల వ్యవసాయ పొలాల్లో వాలుకట్టలు పాటు కాలువలు చెరువుల పూడికతీత వంటి పనులు చేపట్టాలన్నారు. చెరువుల్లో పూడికతీత పనులు ముమ్మరంగా చేపట్టాలని అన్నారు. అనంతరం ఏఎస్వో చేతన్ మాట్లాడుతూ… స్వీయ కులగణన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈనెల 10 వరకు సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది స్వీయగణన చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ బాలాజీ, ఉపాధి హామీ ఈసీ మహిపాల్ రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply