బంగ్లా టు ఆఫీస్ సైకిల్ పైనే

బంగ్లా టు ఆఫీస్ సైకిల్ పైనే
- ఇంధన పొదుపు అవగాహనకై పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి
పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ సరికొత్త ఆదర్శాన్ని చాటారు. ఆమేరకు సోమవారం ఆయన తన నివాసం (బంగ్లా) నుండి కలెక్టరేట్ వరకు సైకిల్‌పై ప్రయాణించారు.
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు కలెక్టర్ ఈ విధంగా సైకిల్‌పై రావడం అందరినీ ఆకట్టుకుంది.
