రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
– ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య
చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు లక్ష బస్తాల సామర్థ్యం గల నూతన ధాన్యం నిల్వ గోదామును సర్పంచ్ జువ్వి నర్సింహ్మతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ, ఐకేపీ ధాన్యం కేంద్రాల్లో వచ్చే చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నూతన గోదాం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపల్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బత్తుల శ్రీహరి, రాచకొండ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
