లైబ్రరీ ఒక విజ్ఞాన గని

లైబ్రరీ ఒక విజ్ఞాన గని

  • ఘనంగా గ్రంథాలయ దినోత్సవ వేడుకలు
  • విద్యావారోత్సవాల్లో డీఈఓ విజయ కుమారి

​మేడ్చల్, ఆంధ్రప్రభ: సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ విద్యావారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా గ్రంథాలయంలో ‘లైబ్రరీ డే’ (గ్రంథాలయ దినోత్సవం) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లైబ్రరీ అనేది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పరిశోధకులకు ఒక పవిత్రమైన దేవాలయం వంటిదని కొనియాడారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయాల్లోని ఇతర పుస్తకాలను చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

​జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. మన చరిత్ర, సంస్కృతి భాషా సంపదను పుస్తకాల రూపంలో భావితరాలకు అందించే గొప్ప వేదిక గ్రంథాలయమని తెలిపారు. అనంతరం, లైబ్రరీలో అత్యధికంగా పుస్తకాలు చదివే బెస్ట్ రీడర్స్ ను గుర్తించి, చైర్మన్ చేతుల మీదుగా వారికి ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ రిటైర్డ్ ఎస్టీఓ, మేడ్చల్ మండల విద్యాశాఖాధికారి శంకరయ్య, స్థానిక నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాఠకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply