లింగాపూర్, కర్ణపేట గ్రామాల నుంచి బీఆర్ఎస్‌లో చేరిక..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని లింగాపూర్, కర్ణపేట గ్రామాలకు చెందిన పలువురు నాయకులు మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.
లింగాపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు బచ్చల అంజయ్య ఆధ్వర్యంలో, లింగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజు నాయక్, అలాగే కర్ణపేట గ్రామ పంచాయతీ 2వ వార్డు సభ్యుడు గంగాధర్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా నడిపెల్లి విజిత్ కుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా చేరుతున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు, మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
