దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం

దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం

  • మాదన్నపేట చెరువు కట్టపై ఎల్.టి విద్యుత్ లైన్ పనులు ప్రారంభం

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ ; నర్సంపేట పట్టణ పరిధిలోని మాదన్నపేట చెరువు కట్టపై శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి కంఠ మహేశ్వర స్వామి ఆలయం వరకు నూతన (ఎల్.టి) విద్యుత్ లైన్ ఏర్పాటు పనులను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్, 1వ వార్డు కౌన్సిలర్ కొత్తకొండ మేఘన శ్యామ్ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మాదన్నపేట, నాగూర్లపల్లి, పర్ష నాయక్ తండా గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విద్యుత్ సమస్యకు నేటితో శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. ముఖ్యంగా ప్రతి ఏటా జరిగే మహా శివరాత్రి ఉత్సవాల సమయంలో ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఎల్.టి విద్యుత్ లైన్ ఏర్పాటు ద్వారా ఆలయ మార్గం వెలుగులతో కళకళలాడనుందని తెలిపారు.

కంఠ మహేశ్వర స్వామి ఆలయం వరకు విద్యుత్ లైన్ మంజూరుకు మాదన్నపేట, నాగూర్లపల్లె గౌడ సంఘాల నాయకులు నిరంతరం కృషి చేశారని, వారి పట్టుదల ఫలితంగానే ఈ పనులు ప్రారంభమయ్యాయని కౌన్సిలర్లు అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ (జి సి సి) డైరెక్టర్ కొర్ర రాజన్న నాయక్, మాజీ ఎంపిటిసి మచ్చిక నరసయ్య, గౌడ సంఘం నాయకులు గాదుగోని సుదర్శన్, వేముల చంద్రమౌళి గౌడ్, నాతి శ్రీను, మేడేపల్లి ప్రసాద్, మచ్చిక సతీష్, పల్లె ప్రశాంత్, తనుగుల విష్ణు, నాతి రమేష్, ఎన్‌పీడీసీఎల్ లైన్‌మన్ విష్ణు, జూనియర్ లైన్మెన్ ప్రశాంత్, హెల్పర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply