కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సొంతంటి కళ నెరవేరింది

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సొంతంటి కళ నెరవేరింది
మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో రాపర్తి మంజుల సైదులు గౌడ్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ దేప రమ్య రాజుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి సొంతింటి కళ నెరవేర్చాలని దృఢ సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్లను దశల వారీగా మంజూరు చేసి వారి కళలను నెరవేరుస్తుందన్నారు. దశల వారీగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అనంతరం రాపర్తి సైదులు గౌడ్ – మంజుల దంపతులు చైర్మన్ పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ రమ్య రాజు లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో షాదీఖానా చైర్మన్ షేక్ కరీం, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు కొనం వినోద, నాయకులు దేప రాజు, పదో వార్డ్ అధ్యక్షులు పోలోజు శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షులు కానుగు మధు, రాపర్తి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
