టార్పాలిన్ ల మాయంపై పోలీసుల పరిశీలన
టార్పాలిన్ ల మాయంపై పోలీసుల పరిశీలన
నర్సింహులపేట, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని పీఎసీఎస్ కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకువచ్చిన ధాన్యం వర్షానికి తడవకుండా ఉండేందుకు కప్పి ఉంచిన టార్పాలిన్ లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన సంఘటనలో శుక్రవారం స్థానిక ఎస్సై వెంకన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. జాగ్రత్తలు వహించాలని పీఎసీఎస్ సిబ్బందికి సూచించారు. పీఎసీఎస్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ సిబ్బంది రైతుల తదితరులు ఉన్నారు.
