బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్పీలో చేరిన నాయకులు
తొర్రూర్ టౌన్,ఆంధ్రప్రభ: మండలానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీలకు రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బత్తుల కుమారస్వామి, టీఆర్పీ రాష్ట్ర యువజన నాయకుడు కొమ్మినేని శరత్ పటేల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయని పార్టీ నాయకులు తెలిపారు.
పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు దీకొండ బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ దీకొండ బాలరాజ్‌లను పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, తెలంగాణలోని మెజారిటీ వర్గాల ప్రజల హక్కుల సాధన, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన నాయకులు కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
