TG | పాపం అక్కడికక్కడే ఇద్దరు…

TG | పాపం అక్కడికక్కడే ఇద్దరు…

TG |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని బైపాస్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీ ఆటోను అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం…. తుల్జాపూర్ భవానీ మాతదర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాలీ ఆటోను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.