యుద్ధ ప్రాతిపదికన,మక్కలు,వరి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలి..

యుద్ధ ప్రాతిపదికన,మక్కలు,వరి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలి..

సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి
15 రోజులు నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించినా కూడా అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వం మొండి వైఖరి వల్ల రైతులు అనేక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు….

ఎల్కతుర్తి ,ఆంధ్రప్రభ : మొక్కజొన్నలు వరి ధాన్యం కొనుగోలు చేయాలని సిపిఐ పార్టీ రైతులు కలిసి హనుమకొండ కరీంనగర్ రహదారిపై వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రెబిక్షపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి కేంద్రాల ద్వారా వరి ధాన్యం మరియు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రైస్ మిల్లర్స్ తో అధికారులతో పత్రిక ముఖంగాసమావేశాలునిర్వహించిన కూడా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని విమర్శించారు. ప్రభుత్వం మొండి వైఖరి వైఖరితో 15 రోజులుగా కొనుగోలు చేయాలని రైతులు మొరపెట్టుకున్న అధికారులు సందర్శనచేసిన కూడా క్వింటాల్కు మరి ధాన్యం 8 కిలోల చొప్పున తరుగుదల ఇతర నిబంధనల పేరుతో రైతులను అధికారులు రైస్ మిల్లర్స్ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని చెప్పిన కూడా క్రింది స్థాయిలో అమలు చేయడం లేదు రైతులను నిర్లక్ష్యం చేసిన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నిబంధనల పేరుతో తరుగుదలను ఆపాలని పకృతి వైపరీత్యం వల్ల వడగళ్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు ప్రభుత్వాలు రైతే దేశానికి వెన్నెముక అనే నినాదాన్ని తుంగలో తొక్కుతున్నారు. ధర్నాతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వెంటనే స్థానిక ఎస్సై నరసింహ రావు వచ్చి అధికారుల దృష్టి తీసుకుపోయి వరి ధాన్యం మొక్కజొన్నలను కొనుగోలు చేయుటకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో ముగించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వుట్కూరి రాములు, కర్రెలక్ష్మణ్,సిపిఐ మండల కార్యదర్శి శనిగరం రాజకుమార్,సిపిఐ నాయకులు గడ్డం రాజనర్సు, మరి పెళ్లి తిరుమల,గడ్డం లలిత,తండముండయ్య, సూర మొగిలి,మోహన్ రెడ్డి, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.