AP | స్కూటర్‌ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి..
AP |మంత్రాలయం, జూలై 29 (ఆంధ్రప్రభ ) : మంత్రాలయం–ఎమ్మిగనూరు జాతీయ రహదారిలో కల్లుదేవకుంట హాస్పిటల్ సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆస్పరికి చెందిన చాకలి రాఘవేంద్ర మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో బాధితుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో దుర్మరణం చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై స్పందించిన గ్రామస్తులు, లారీల అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ఆరోపించారు. కల్లుదేవకుంట హైవే రోడ్డును ప్రతిరోజూ విద్యార్థులు దాటాల్సి వస్తోందని, ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కల్లుదేవకుంట హాస్పిటల్ సమీపంలో, పాఠశాల విద్యార్థుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతంలో వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, హెచ్చరిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని, జాతీయ రహదారి అధికారులను కోరుతున్నారు.
