భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
ప్రజల భద్రతకు అన్ని చర్యలు చేపడుతున్నాం: తహసీల్దార్ సర్వర్
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నాయిగూడెం తహసీల్దార్ సర్వర్ ఒక ప్రకటనలో కోరారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు పరిస్థితిని బట్టి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు చేపడుతోందని, అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా పనిచేస్తున్నారని తహసీల్దార్ సర్వర్ తెలిపారు.
