ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
చిట్యాల, ఆంధ్రప్రభ: ఈనెల10 హైదరాబాదులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను శ్రేణులు విజయవంతం చేయాలని జిల్లా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. నేడు చిట్యాల మండలం లోని పెద్ద కాపర్తి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు పీక వెంకన్న ఆధ్వర్యంలో బీజేపీ మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల మండల ఇన్చార్జ్ షాగా చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ… ఈనెల 10వ తారీఖున పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించు బహిరంగ సభకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మైల నరసింహ, మాజీ మండల అధ్యక్షుడు పొట్లపల్లి నరసింహ, ఉన్న విష్ణు, నాగాచారి, తెల్సూరి నరసింహ, జిల్లా ప్రశాంత్ మోర ధనుంజయ, వరాల లింగస్వామి ఆరూరి రవి, ఆకు ఎంకన్న, కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, శివకోటి ప్రవీణ్, గంట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
