Temple | శివనామ స్మరణతో…

Temple | శివనామ స్మరణతో…

Kamareddy | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వర ఆలయం(Siddhi Rameshwara Temple)లో ఈ రోజు కార్తీకమాస పూజలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పలు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.

ఆలయంలో గల మూలబావి(Moolabavini)నీటితో భక్తులు తల స్నానాలు చేశారు. అనంతరం ఆలయంలో గల స్వామి వారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పలువురు జంటలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు(Karthika Deepas) వెలిగించి స్వామివారికి సమర్పించారు.

శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఆలయం వద్ద ఇబ్బందులు లేకుండా ఆలయ కార్యనిర్వాన అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో పూజల అనంతరం భక్తులు వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు.

Leave a Reply