Parenting Lesson | ఏఐ వీడియోతో పోలీసుల సందేశం..
Parenting Lesson | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: పేరెంటింగ్పై ఉత్తరాఖండ్ పోలీసులు పంచుకున్న ఓ ఏఐ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. జంతువుల ద్వారా మానవ విలువలను చక్కగా ప్రతిబింబించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
వీడియోలో ఓ పర్యాటకుడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను ఓ పిల్ల కోతి లాక్కుంటుంది. వెంటనే అక్కడికి వచ్చిన తల్లి కోతి పిల్లను వారించి, ఆ ఫోన్ను తిరిగి పర్యాటకుడికి అందిస్తుంది. ఈ దృశ్యాన్ని ఆధారంగా చేసుకుని పిల్లలు పెద్దల ప్రవర్తనను చూసే నేర్చుకుంటారనే సందేశాన్ని ఉత్తరాఖండ్ పోలీసులు అందించారు.

“పిల్లలు మనం చెప్పేది కాదు.. మనం చేసేదే ఎక్కువగా నేర్చుకుంటారు” అనే భావనను ఈ వీడియో ద్వారా వివరించారు. జంతువులు కూడా తమ పిల్లలకు సరైన ప్రవర్తన నేర్పిస్తుంటే, మనుషులుగా మన బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
సామాజిక బాధ్యత, నైతిక విలువలు, మంచి ప్రవర్తన వంటి అంశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పోలీసుల వినూత్న ప్రయత్నాన్ని పలువురు ప్రశంసిస్తూ, ప్రతి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన వీడియో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
