మార్కండేయ జయంతిని అధికారికంగా జరపాలి

మార్కండేయ జయంతిని అధికారికంగా జరపాలి
ఆలేరు, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం పద్మశాలీల ఆరాధ్య దైవమైన మార్కండేయ జయంతిని అధికారికంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక మార్కండేయ పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు అమృతం నరసింహులు, ప్రస్తుత సంఘం ఉపాధ్యక్షులు ఎలగందుల రవి మంగళవారం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి అధికారిక ఉత్తర్వును త్వరలోనే విడుదల చేయాలని వారు కోరారు. పద్మశాలీల శాశ్వత గుర్తింపు కోసం ఈ అధికారిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా నిర్వహించాలి అన్నారు.
