దొంగ‌ల‌తో జాగ్ర‌త్త‌

బక్రీద్ వేళ గొర్రెలు, మేకలు ఎత్తుకెళ్లే అవ‌కాశం : ఎస్ఐ

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని చౌటుప్పల్ మండలంలో గొర్రెలు, మేకల దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, ప్రజలు, పశుపోషకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ హెచ్చరించారు.

బుధవారం ఆయన మాట్లాడుతూ… పండుగ సీజన్‌ను ఆసరాగా చేసుకుని కొంతమంది గుర్తుతెలియని దుండగులు కార్లు, ఇతర వాహనాలలో గ్రామాల్లోకి చొరబడి, మేకలను, గొర్రెలను దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ​గ్రామాల్లోకి కొత్తగా వచ్చే వాహనాలు, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల పట్ల స్థానికులు నిఘా ఉంచాలని, ​ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. ​

పశువుల కాపరులు, యజమానులు రాత్రి వేళల్లో తమ మూగజీవాల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ​శాంతిభద్రతల పరిరక్షణకు, దొంగతనాల నివారణకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, ఎలాంటి అనుమానం వచ్చినా ఆలస్యం చేయకుండా సమాచారం ఇవ్వాలని ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ కోరారు.

Leave a Reply