Telangana | జాతీయ రహదారిపై ఘటన

Telangana | జాతీయ రహదారిపై ఘటన

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మెదక్‌ జిల్లా మూసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ఓ ట్రావెల్స్‌ బస్సు అగ్నికి ఆహుతైంది. మెదక్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం బస్సు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.